పుట:Dvipada-basavapuraanamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

177

భావింప నటమీఁది పను లే నెఱుంగ
సప్పుడ విచ్చేసె" నని విన్నవింపఁ
“దప్పదు బసవఁడు దాన కానోఁపు
గడు నర్ధసంపద గల భక్తు లరసి
బడుగుభక్తులఁ బ్రోవఁ బాడియ కాదె ?
దాత గాఁడే యిట్లు దాఁ బ్రోవ కెవడు
ప్రోతురు ? మేలయ్యెఁ బో ; బ్రదికితిమి 430
తనబిడ్డఁ డని మమ్ముఁ దలఁచి యిచ్చఱికిఁ
జమదెంచె నింతయు చాలదే మాకు ?
నిమ్ముల మాలింగ మిచ్చిన కాయ
కమ్మ యీపూఁటకుఁ గలిగున్న" దనుచుఁ
జక్కన నిద్దఱు జంగమంబులకు
నొక్కొక్క విడియ నియోగించి మ్రొక్కి
సదమలస్థితి నున్న జంగమకోటి
పదపద్మములు గడ్గి భక్తితో వారి
శ్రీపాదజలములు సిలికింపఁ గట్టె
మోపు గడానియై యేపారి వెలుఁగ 440
వేడుక మదిఁ దులుకాడ వేయేసి
మాడలయెత్తు గాఁ గూడ ఖండించి
యున్న జంగమకోటి కొక్కొక్క నక్కు
చెన్నుగా నర్పణసేసి మ్రొక్కుడును ,
నక్కజం బందుచు నా జంగమములు
గ్రక్కున బుసవనికడఁ బ్రసరించి
“మిక్కిలి భక్తికి నిక్కంబు నియతి
కెక్కుడుచేఁతకు నెల్ల యై పరఁగు
మోళిగమారయ్యఁ బోలంగ భక్తు
లేలోకమునఁ గలరే!" యని పొగడ 450
బసవఁడు బిట్టుల్కిపడి యేఁదెంచి
“యసదృశ కావవే” యని సాఁగి మ్రొక్క