పుట:Dvipada-basavapuraanamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

బసవపురాణము

గట్టుద మనువారు గల రెట్లు సెపుమ !
యేర్పడఁ గార్యాంశ మెఱుఁగుము ; మాట
లార్పుము ; తగువారి నరయఁగఁ బంపు; 170
మఱి యెందుఁబోయెడు మర్యాద లెల్ల
నెఱుఁగుదు గా కేమి యింతయు." ననినఁ
దన ప్రధానుంఁ జూచి ధారుణీశ్వరుఁడు
పనిచినఁ ద్రిపురాంతకునిగుడి కేఁగి
కిన్నరబ్రహ్మయ్యఁ గన్నంత మ్రొక్కి
“యన్నన్న : తగు నె ? నీయట్టిభక్తుండు
హింసకు లోనౌట కేమి కారణము ?
సంసారి నేటికి సరిచేసికొంటి
విగ మెడ దునిమెద విది యేమి వుట్టె ?
జగములలో రిత్తసడి వచ్చె నీకుఁ ; 180
గొఱగాని జఱభుల కొయ్యనగాండ్ర
గొఱియల వార్తలు గూడునే త్రవ్వ ?
భూమీశ్వరుఁడు మమ్ముఁ బుత్తెంచె నరయ ;
నే మని చెప్పుదు మింక ?" నావుడును
“నివియేల వెడమాట లిన్నియు వాఁడు
తివియఁ దివియఁ ద్రాడు ద్రెవ్వుడు గొఱియ
గుడిసొచ్చుడును- 'బట్టఁగూడదు దీని
విడువుము : కాదేని వెలచెప్పి కొనుము
ఇమ్మడి ముమ్మడి యిచ్చెద ' ననిన
నెమ్మెయి నొల్లక ‘యిట్టిభక్తుండు 190
వేయిచ్చియైనను విడిపించుఁ గాని
యీయయ్య గొనిపోవనిచ్చునే ? ' యనిన
'విండ్రె యీ మామాటలు వేయుమాడలకుఁ
గొండ్రె యెచ్చటను గొఱియ' నన్నట్టు
వెక్కసం బందంగ వేయుమాడను
జక్కఁగ నెన్నితిఁ జౌకంబు ద్రోచి
'యెప్పాట మడిగిన నీఁజుమ్ము ' రనుచుఁ