పుట:Dvipada-basavapuraanamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

169

జెప్పి యచ్చోత్తితి శివలాంఛనంబు ;
కాంత ద న్నెంతయుఁ గడవఁ బల్కినను
నెంతయుఁ గొన్నాఁడ నే ధనం బనక 200
కొండొక వ్రొద్దుండి వెండి యేతెంచి
మిండండు బసవనిమెడఁద్రాడు వెట్ట,
వల దని వారింప నలుగు వెఱికినఁ
దలఁ ద్రుంచివై చితిఁ ; ద ప్పెవ్వరిదియొ ?
యట్టౌట కీత్రిపురారియే సాక్షి ;
పట్టినఁ బలికింతు నిట్టని చెపుఁడ"
యనవుడు నతివిస్మయాక్రాంతు లగుచు
జననాథునకు నిట్లు వినుపింపఁ దడవ
“నద్దిరా ! భక్తుని [1]యఱగొడ్డెతనము
విద్దె లాడెడుఁగాక విందుమే తొల్లి ? 210
విపరీత మిందఱు వినఁ 'బలికింతుఁ
ద్రిపురారి ' ననుటెల్లఁ గపటమో నిజమొ
చూతముకాక !" యంచును బిజ్జలుండు
నేతెంచె నధికవిభూతి భాతిగను
బసవఁడుఁ గిన్నరబ్రహ్మయ్య పాద
బిసరుహాక్రాంతుఁ డై ప్రీతి యెలర్ప
“శృంగారములకీలు శివుకరవాలు
మంగళత్వ మునికి మానంబు మనికి
విజయంబుత్రుళ్ళు వివేకంబుపెల్లు
నిజగుణ స్తుతి యూఁత నిష్ఠలచేఁత 220
సత్యంబుభాతి యాస్థానంబుజ్యోతి
ప్రత్యయంబులరాజు భావుక మోజు
యాగంబుతునియ విరాగంబుగనియ
యాగమంబుల తెల్ల హర్షంపుటెల్ల
శాంతంబుప్రోగు సజ్జనభక్తిబాగు
దాంతత పెంపు వ్రతాపంబుసొంపు'

  1. బింకము ; ధైర్యము.