పుట:Dvipada-basavapuraanamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

159

యిచ్చినఁ గైకోఁడె యీజనవ్రాత
మచ్చెరువందుచు నర్థిఁ గీర్తింప! 730

—: కొట్టరువు చోడని కథ :—


నట్టునుగాక మున్ పట్టంబు దేవి
కొట్టరువందు మాకొల్చుఁ గుడ్చుడును
గర్భిణినాక తద్గర్భంబులోని
యర్బకు సహితంబ హరియింపఁ దడవఁ
గోరి మోక్షము వేఁడికొనఁడె మెచ్చినను
నారచోడఁడు : మఱి యట్లనే మెచ్చి
భంగిగా నభిమతఫల మడుగు మనఁ
గింగాణమును జేయ దంగనఁ జూడు !
తప్పు సేసిన మహోద్దతభక్తి యుక్తిఁ
దప్పేమి సంపెఁ భో తన్వి దనూజు 740
నడుగంగవలదె ప్రత్యక్షమైయున్న
యెడ ? నింతిమాహాత్మ్య మే మనవచ్చు ?
నడిగినఁ జంపితి; వడుగఁ దనూజు
మడియించి పిల్చితి ; మఱి పిల్వ దతివ :
యిట్టిట్టిభక్తు లనేకు లుండంగ
నెట్టయా సిరియాల ! యేనకా కంటి
భక్తి తో గర్వించి పలుకుటయెల్ల
యుక్తియే ?" యనుచుఁ దద్భక్తవత్సలుడు
బాలుని నంత సప్రాణుఁ గావించి
కైలాసమున కన్చెఁ గమనీయలీల. 750
"జంగమలింగ పూజనము వీక్షింప
భంగిఁ జతుర్వర్గ ఫలములకంటె
నుత్కృష్ట” మని ధర నుండె నిమ్మవ్వ.
సయలందెల్ల ఁ జనునె గర్వోక్తి ?
యట్టిదకాక యహంకరించినను
బట్టిచ్చునే భక్తి బసవకుమార !" *