పుట:Dvipada-basavapuraanamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

బసవపురాణము

యని యిట్లు మాచయ్య యతిభ క్తి యుక్తిఁ
జనిన సద్భక్తులచరితము ల్దెలిపి
బుద్ధులు నీతులుఁ బోలంగఁ జెప్పి
పెద్దైనగర్వంబు పెల్లు మాయించి 760
మెఱుఁగులఁ గన్నులు మిఱుమిట్లువోవ
వఱలెడు రత్నపర్వతము లత్యర్థి
నాజంగమంబున కర్పించి బసవ
రాజు వీడ్కొలుప నిరంతరభక్తి
సబ్బసవండు వాదాక్రాంతుఁ డగుచు
నుబ్బుచు భక్తాలియును దాను నరిగె.
నప్పౌరు లెల్ల సాష్టాంగు లై మ్రొక్కి
“తప్పదు దేవర దా నీతఁ "డనుచుఁ
గరములు నిజమస్తకంబులఁ దాల్చి
యరిగిరి ధారుణీశ్వరుఁడును దారు. 770
మహిఁ దొంటియట్టుల మాచయ్య భక్తి
మహిమమైఁ ద్రిభువనమాన్యుఁ డై యుండె.
మడివాలుమాచయ్య మహనీయచరిత
మడరంగఁ జదివిన నర్థి మై విన్న
హరుభక్తి బుద్ధి దృష్టాదృష్టసిద్ధి
సరసవచశ్శుద్దిసంపద లొందు.
గురుభక్తి విస్తార ! గురుభక్తి సార !
గురుభ క్తిపరతంత్ర : గురుభక్తి తంత్ర :
జంగమసుఖకృత్య : జంగమభృత్య !
జంగమహితచర్య : జంగమధుర్య ! 780
లింగార్చనాసక్త ! లింగసద్భక్త
లింగలీన : ప్రాణలింగధురీణ !
సత్ప్రసాదోపాంగ ; సత్ప్రసాదాంగ
సత్ప్రసాదపరీక్ష ! సత్ప్రసాదాక్ష
సర్వస్థలై కభాస్వద్భక్తి సౌఖ్య :