పుట:Dvipada-basavapuraanamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

బసవపురాణము

నచ్చెల్వనాసికం బప్పుడ కోయ700
నచ్చోటి కప్పుడ యచ్చోడనృపతి
వచ్చుడు సతితోడ వనితలు మ్రొక్కి
“దేవ ! తప్పేమియుఁ గావింప దిచట
దేవి వోవుచు నొకపూవు మూర్కొన్న
లింగార్థమై యున్న చెంగల్వపూవు
నంగన మూర్కొనె నని ముక్కుఁ గోసి
వైచె నీపూజారివడు" గని చెప్ప
“నో చెల్ల ! తగ దిట్టు లుచితమే నీకు"
ననుచుఁ బూవులవడ్గు నప్పుడ విల్వఁ
బనిచి “నీ కిది భక్తి పాటియే వడుగ !710
యెట్టివివేకి వై తిటమున్ను పువ్వు
ముట్టినచెయి మొట్టమొదటికిఁ గోసి
మఱికదా కోయుట మగువ నాసికము ?
ఎఱుఁగవు నిన్ను నీ కేమనఁ గలదు ? "
అనుచు నిజాంగన నచటికిఁ బిలువఁ
బనిచి భూపతి వాఁడి బాడిత యెత్తి
“నిన్ను నీ వెఱుఁగక యన్నెక్కి కొవ్వి
మున్నీశ్వరార్థమై యున్న పూవునకుఁ
జాఁచిన చెయ్యేది సక్కన నపుడు
చాఁచినట్లే చాఁపు చాఁపు ర" మ్మనుచు 720
ముట్టిన యంగుళుల్ మొదలికి నఱికి
పట్టఁ జూచిన మణికట్టు ఖండించి
తివిచినమోచెయ్యిఁ ద్రెవ్వంగ నడిచి
యవిచారమున మొదలంట వదల్ప
నత్తఱి నేము ప్రత్యక్షమై నిలిచి
తుత్తున్కలై యున్నయత్త్వన్వి చేయి
మును గోసివై చినముక్కును నొసఁగి
జననాథునకు నంత సామీప్యము క్తి