పుట:Dvipada-basavapuraanamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

157

భోగయ్య యింటికిఁ బోయిననాడు
ఏగౌరిసహితమై యేఁగితి చెపుమ ?
దాసయ్యచే వస్త్రదానంబు గొనఁగ
నేసోమకళఁ దాల్చి యేఁగితి చెపుమ ?
మానకంజారుని మందిరంబునకు
నేనంది నెక్కి నీ వేఁగితి చెపుమ ?
యీచిఱుతొండని యింటికి నీవు
నేచతుర్భుజముల నేఁగితో చెపుమ ? 680
కావున నీచమత్కారము ల్మాను;
మీవేడబము లెల్ల నే మెఱుంగుదుము ;
ఎట్టై న నుండు మీ విట్టారగింపఁ
బెట్టుదు ; నీయాన ప్రిదిలితినేని." ;
యనుచు నిష్ఠించి నిమ్మవ్వ వల్కంగ
మనసిజాంతకుఁడు మెల్లన నవ్వు దనర
"నట్టైన నవుఁగాక" యని యారగింపఁ
బెట్ట నాసిరియాలసెట్టి కి ట్లనియెఁ :
గడుభక్తిఁ జండేశ కాటకోటాదు
లడరంగఁ దండ్రుల నాప్తులఁ దప్ప 690
నడచినఁ జంపరే ? నఱకరే మగుడఁ
బడయరే ! వేఁడరే ప్రత్యక్షమైన ?
విను మట్లుఁగాక ద్రావిడదేశమందుఁ
జనినపురాతన శరణులలోన

—: నరసింగనయనారుని కథ :—


నరసింగ మొన్నయనారనురాజు
ధరణి మద్భక్తుఁ డాతని యగ్రమహిషి
కరమర్థి నాయూరివరమేశుఁ గొలువ
నరుగుచోఁ బూజార్హ మగుపుష్ప మొకటి
పుచ్చి మూర్కొనుడును [1] బువ్వులవడుగు

  1. పూజారి బాలుఁడు.