పుట:Dvipada-basavapuraanamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

145

“నీమహత్త్వముఁ జూడ నే నెంతవాఁడ ?
ధీమణి ! సంగయ్య ! దేవ ! సర్వజ్ఞ :
నీవు శంకరుఁడవు నేను గింకరుఁడ;
నీవు నిర్మలుఁడవు నేను దుర్మలుఁడ ;
నీవు విజ్ఞానివి నే నవిజ్ఞాని ,
నీ వమృతాంగుండ వే విషాంగుండ ;
నీవు మహాదాత వేఁ గృపణుండ ;
నీవు వశుపతివి నేఁ బశుజీవి ; 340
స్వామి : త్రైలోక్యచూడామణి వీవు
భూమి నిర్భాగ్యచూడామణి నేను ;
బొరి నిట్టి దుర్గుణంబుల ప్రోఁకలోన
నరయంగఁ గలదె నాయందు సద్గుణము ?
రక్షింపు మిట్టిగర్వప్రాప్తు నన్ను :
శిక్షింపవే యయ్య ! జియ్య ! నాదైన
యపరాధశతసహస్రావలి సైఁచి
విపరీతమహిమాఢ్య : వేయును నేల ?"
యనుచున్న బసవన్న నందంద కౌఁగి
టను జేర్చి కారుణ్యవనధి నోలార్చి 350
“కలుగునే కాదె లింగంబునందైనఁ
దలఁపఁ గోపప్రసాదంబులు రెండు
చేరింటికైనఁ జెచ్చెరఁ గడవఁగొను
వారు సేపట్టరు వాయించికాని
ధర నంతకంటెను దమభృత్యవితతి
నొరయక చేపట్టుదురె యట్లు గాక
యందులమాలిన్య మడఁపఁగఁ గాక
యెందుఁ జీరల కల్గునే రజకుండు ?
అట్టిద బసవయ్యఁ బట్టి మాచయ్య
ధట్టించి నిర్మలత్వంబు నొందించె; 360
నెన్నంగ వేమాఱు నెంతగాఁచినను