పుట:Dvipada-basavapuraanamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

బసవపురాణము

నేనికదున్నలు నిలఁ బచ్చమన్ను
గుఱ్ఱపుగాడిదల్ గుటిలంపుసతులు
నెఱ్ఱకోకలు బ్రాఁతియే శరణులకు ;
నీదిక్కుఁ జూడుమా సాదుజంగమము
పేదఱికములేని పెల్లు సూపెదను
నది గొ” మ్మనుచుఁ జల్ల నందంద నెగయు
సదమలోదకకణజాలమంతయును 310
మరకత నీలనిర్మల పుష్యరాగ
వరవజ్ర విద్రుమ వైడూర్యముఖ్య
వినుతరత్నాచలవితతి యై వెలుఁగ
నినుఁడు ఖద్యోతమ ట్లిఱివిరిఁ దోఁప
నట పౌరు లత్యద్భుతాక్రాంతు లగుచు
నిట బిజ్జలుఁడుఁ దారు నేతెంచి చూడ
నమరి మాచయ యుండెఁ బ్రమథప్రసాద
విమలపుష్పాంచితవృష్టి పైఁ గురియ
బసవని నభిమతఫలములఁ దనుప
నసమాక్షుఁ డర్చితుఁడై యున్నయట్లు 320
జంగమం బొప్పె నాలింగావతార
సంగతి మాచయ్య సద్భక్తి మహిమ
మెఱుఁగఁగఁ జాలక యిన్నిరూపములు
వఱలఁగఁ దాల్చినతెఱఁగునుబోలె
నట్టిజంగమసభాభ్యంతరాళమున
నొట్టిన రత్నంపుఁదిట్టలకఱుత
భక్తుల కేనసూ బండారి నన్న
యుక్తి నబ్బసవరా జుండె; వెండియును
వారక యా మడివాలుమాచయ్య
గారల శ్రీపాదకంజంబులకును
మున్ను సాష్టాంగుఁడై మ్రొక్కుచుఁ జేరి 320
సన్నుతి సేయుచు శరణు వేఁడుచును