పుట:Dvipada-basavapuraanamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

బసవపురాణము

వన్నెక్కుఁగాదె సువర్ణంబు మిగుల :
నింతింతగాఁ జేయ నిక్షుఖండంబు
నంతకంతకుఁ దీపు లధిక మౌఁగాదె !
ఱంపానిఁ గోసిన ఱాచిన నెఱయఁ
గంపెక్కుఁగాదె శ్రీగంధంబునకును !
ఱాచిన మడివాలుమాచయ్య యొరసి
చూచుడు బసవయ్య శుద్ధసద్భక్తి
తనరంగ నేఁడుగదా ! తుదముట్టె."
ననుచు భక్తాళి కీర్తనసేయుచుండ 370
ముకుళీకృత వికంపితకరాబ్జుఁ డైన
సుకుమారు బసవయ్యఁ జూచి మాచయ్య
“విను మహంకారించినను భక్తి యగునె ?
విని యెఱుంగవె పురాతనులలోపలను_ *

—: మాచయ్య బసవన్నకు నిమ్మవ్వకథఁ జెప్పుట :—


“[అదియునుగాక] నిమ్మవ్వ యనంగ
సదమలసత్క్రియాస్పదభక్తి నిరత
యకుటిల వీరవ్రతాచారయుక్త
ప్రకటజంగమలింగ పరతంత్రచిత్త
సంసారరహిత నిష్కళ మహిమావ
తంస సజ్జనసముద్యద్గుణో పేత 380
పూరభక్తులిండ్లకు నర్ఘ్యపణ్యములు
కరమర్థి మోచుచుఁ గాయకం బలర
గొడుకు భక్తులయిండ్లఁ గోవులఁ గావ
నుడుగక కాయకోద్యోగలబ్దమున
జంగమాసక్తి లనద్భక్తియుక్తి
సంగతి దినములు జరపు చున్నెడను

—: సిరియాలుని కథ :—


నంచితమతి సిరియాలుండు నాఁగఁ
గంచిలో నిత్య జంగమము లేవురకు