పుట:Dvipada-basavapuraanamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

147

నిష్టాన్నపానాదు లీప్సితార్థములు
దుష్టిగా నందిచ్చుశిష్ట వ్రతమున ! 390
జరియించు చుండంగ, సర్వేశ్వరుండు
సిరియాలు భక్తిలోఁ తరయఁగఁ దలఁచి
కృతక తపోధనాకృతి నేఁగుదేర
హితజంగ మార్థమై యేతెంచి నెట్టి
మస్తకవిన్యస్తహ స్తుఁడై తపసిఁ
బ్రస్తుతింపుచుఁ బదాబ్జంబుల కెరఁగి
“స్వామి ! వే వేంచేయవే ! మహాపురుష :
నీమనుమనినిత్యనేమంబుసలుప"
నని విన్నవించుడు న త్తపోధనుఁడు
“ననఘ ! మాయిచ్చ సేయఁగ నోపుదేని 400
నింతకంటెను సుఖం బెద్ది మా" కనుచు
సంతసంబందుచు సదయుఁడ పోలె
సిరియాలుఁ గరుణాభిషిక్తుఁ జేయుచును
నరమాంస మొక్కొక్క వెరవున నడుగ
"సర్వజ్ఞ : మీమనోజ్ఞంబై నయట్టి
సర్వలక్షణగుణ సంపూర్ణుఁ డొక్క
వరపుత్త్రుఁ డున్నాఁడు. నరమాంస మింకఁ
బొరుగింటికిని విల్వఁ బోయెదనయ్య ?
యరుదైన మీవ్రతోద్యాపన నేఁడు
కరమర్ధి జెల్లింతు [1]క్షణముగొ" మ్మనుచు 410
నడుగులఁ బడి సిరియాలుండు దపసి
నొడఁబర్చి యింటికి వడి నేఁగుదెంచి
తన సాధ్వి కొయ్యన తత్కార్యధార
వినిపింప “నీ వేల వెఱచెద" వనుచు
సంగళవ్వయు నప్డు చదివెడుపుత్త్రు
మంగళం బలరఁ గ్రమ్మనఁ దోడితెచ్చి

  1. బోజనార్థమై చేసిన ప్రార్థనము.