పుట:Dvipada-basavapuraanamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

141

కలియుగరుద్రుఁడుగాక మాచయ్య
తలఁపఁగ మర్త్యుఁడే ధరణీశ ! యిదియ
కజ్జంబు" నాపుడు బిజ్జలుఁ డంత
లజ్జయు సిగ్గును బుజ్జగింపంగ

—: బసవన్న బిజ్జలుని మాచయ్యకడకుఁ బిలుచుకొనిపోవుట :—


'నవుఁగాక ' యని వచ్చి యఖిలంబు నెఱుఁగ
భువి సమాస్తాంగము ల్వొంద నల్లంతఁ
బడియున్న, బండారి బసవయ్య వచ్చి
మడివాలుమాచయ్యయడుగుల కెరఁగె;
నసమాసలీలఁ బెం పెసఁగఁ గీర్తించి
బసవఁ డి ట్లని విన్నపముసేయఁ దొడఁగె : 230
“వల దని వారింపఁ జలమున ముక్కు
వొలియించుకొన్నట్టు <> </>వురులు వోనాడి
యిక్కడ రానోడి యెప్పటఁగోలె
నక్కడ సాష్టాంగుఁ డై యున్నవాఁడు ;
పక్షికిఁ దొడ నేల పాశుపతంబు ?
ఈక్షితీశ్వరుఁ డన నెంతటివాఁడు ?
ఎదురు నీ కెవ్వఁ డీరేడులోకముల ?
సదయాత్మ 1 యీతప్పు సైరింపవలయు. "

—: మాచయ్య బిజ్జలుని యేనుఁగును బ్రదికించుట :—


నని విన్నంచిన నట్ల కా కనుచు
జననాథు లెమ్మనఁ బనిచి తత్ క్షణమ 240
యట్టయుఁ బొట్టయు నస్థులుఁ గూడఁ
బెట్టించి జనులు విభీతు లై చూడ
భసితంబు దునియలపైఁ జల్లి యతని
యసమగజేంద్రంబు నొసఁగి తొల్నాఁడు
పొడిచివై చినపీనుఁ గుడువీథిఁ దాఁకి
పడ, నపు సభ భయభ్రాంతు లై బెదర