పుట:Dvipada-basavapuraanamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

బసవపురాణము

తుండంబుఁ జేపట్టి త్రోచి రాఁదిగిచి
యంజలిగుంజలి యల్లార్చి పేర్చి
భంజింపుచును వీరభద్రుండు దివిరి
వడి సృసింహునివైచువడువున వైచుఁ ;
బడనీక లోచేతఁ బెడచేత వేయు;
నచ్చుగా నార్చుచు హరుఁ డిభదైత్యు
వ్రచ్చినగతి వ్రచ్చి వందఱలాడుఁ ;
గోపించి విష్ణునికోలెమ్ము రుద్రుఁ
డేపునఁ దునిమిన ట్లిల నెమ్ము లేఱు ; 200
మాలకు మాంసంబు మఱి గొడారికిని
దోలును గాకుండఁ దొలఁగంగ వైచి
త్రోవ నేతెంచుచోఁ దొలఁగనిబాస
గావున నతులవీరావతారుండు
నిమ్మార్గమున భక్తులెల్ల నుప్పొంగ
నమ్మదకరి పొడవడంచి యాక్షణమ
“యెవ్వండు నామీఁద నేనుంగుఁ గొలిపె
నవ్వసుధేశుక్రొ వ్వడఁతుఁ బొ” మ్మనిన
నింతవృత్తాంతంబు నెఁఱిగి బిజ్జలుఁడు
నంతకమున్ను మో మల్లన వంచి 210
బసవనిదెసఁ జూడఁ బరమహర్షమున
వసుధేశునకు బసవనమంత్రి యనియె :
“వల దని వారింపవారింప వినక
చలమునఁ బంచితి జనులమాటలను ;
నేనుంగుఁ గోల్పడె ; మానంబు వొలిసెఁ ;
దూనిక చెడె ; శివ ద్రోహంబుఁ దగిలె :*
వెరవఱి మార్కొన్నఁ బొరిగొండ్రు, వెఱచి
శరణన్నఁబ్రోతురు హర భక్తవరులు
గాన యిన్నియుఁ జెప్ప' గాఁ బనిలేదు
భూనాథ : మనవలతేని, లే, పొదము; 220