పుట:Dvipada-basavapuraanamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

బసవపురాణము

బొందికిఁ బ్రాణంబుఁ బోసి మాచయ్య
యందఱుఁ జూడంగ నంతరిక్షమున
నున్నవస్త్రములకు వెన్నొగ్గి జనులు
సన్నుతిసేయఁగఁ జనియెఁ జాటుచును. 250
బసవఁడు మాచయ్య పాదము ల్గొలిచి
యసమాను మఠమున కనిచి యేతెంచి
సకలనియోగంబు జనపాలకుండు
ముకుళితహ స్తు లై మ్రొక్కుచు నుండ ;

—: మాచయ్య బసవనిగీతమును విని కోపించుట :—


నంత మాచయ దొంటియట్ల సద్భక్తి
సంతతసత్క్రియాస్పదలీల నడవ
మఱికొన్ని దినముల కఱ లేక బసవఁ
డఱిముఱి నొకగీత మానతిచ్చుడును
భక్తులు దనయొద్దఁ బాడఁగఁ దడప
"యుక్తి యే" యనుచు మహోగ్రతతోడ 260
“శివశివ ' యని కేలు సెవులఁ జేర్చుచును
'నవినీతుఁ డి ట్టుండె హా కల్లినాథ :
చెల్లబో? దీనులఁ జేసి శరణుల
కెల్లను దా నొక యిచ్చువాఁ డయ్యె :
నెన్నఁడు గ్రోతి యయ్యెను ? వెక్కిరింప ;
నెన్నఁడు గఱచె ? నిం కేక్కడిభక్తి ?
దోసంబు గాదె ! భక్తులు దీని విండ్రె ?
బాసలు గీసలు వాట వాడకుఁడు
మాయొద్ద" ననుచును మాచయ్య గినిసి
కాయకంబున కరుకంగ- నిక్కడను 270

—: బసవన్న మాచయ్యకడ కేఁగి మన్నింప వేఁడుట :—


నంత నంతయు నిని యాత్మలోఁ గలఁగి
యంతంత ధరణి సాష్టాంగంబు లిడుచు
బసవఁడు భక్తజనసహాయుఁ డగుచు