పుట:Dvipada-basavapuraanamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

బసవపురాణము

శరమునఁ ద్రెంచిన శబరుండు నతఁడ.
హరిముఖ్యకృమికీటకాదిపశువుల
వెరవునఁ బాలించు వ్రేఱేఁడు నతఁడ.
ప్రకటితకపటనాటకసూత్రములను
వికృతిప్రకృతు లార్చు వెండీఁడు నతఁడ.140
కులనగంబులు నూకి జలధులు సల్లి
పొలము వోడేర్చు నాబోయయు నతఁడ,
యేకార్ణవం బై నయెడ నజాచ్యుతులఁ
జేకొన కుదికెడుచాకియు నతఁడ.
మహితభక్తాళికి మడుఁగులు సేఁత
మహి నిప్డు మడివాలుమాచయ్య యనఁగ
నిన్నియుఁ దాన యై యి ట్లున్న యతని
కెన్నెద వొకగులం బిది నీకుఁ దగునె ?
కారణపురుషావతారుఁ డాయయ్య
చారుచరిత్ర విస్మయ మెట్టు లనిన : 150
నరసింహ శార్ధూలకరిదై త్యచర్మ
పరిధానుభక్తు లపరిధానవితతి
గాని యొం డుదుకఁడు, వానిని నంటఁ
గానీఁడు నితరుల ఘట్టించునెడను
భక్తుల చీరల భక్తుల కిచ్చు :
యుక్తసద్భక్తి నియుక్తి వట్రిల్ల
జంగమం బడిగిన సమకట్ట నిచ్చు :
భంగిగా లింగసంపద దులుకాడఁ
జీరలువై చినవా రడిగినను
వారికిఁ దమతమవస్త్రంబు లిచ్చు ; 160
నటమీఁద నతని మహత్త్వంబు వినఁగఁ
గుటిలాత్ములకు సమకూడదు; మఱియు
జీర లంటినమాత్రఁ గారించుభక్తుఁ
డూరకుండునె చంప కీరు వోయినను ?