పుట:Dvipada-basavapuraanamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

137

యానీలగళు నపరావతారంబు
గాన యాతఁడు సర్వగతుఁ ; డెట్టు లనిన :
సరసిజభవుజడల్ జన్నిదంబులుగఁ
బరఁగ భిక్షించిన బ్రాహ్మణుఁ డతఁడ ; 110
మహితాపవర్గ సామ్రాజ్యపట్టంబు
సహజంబ పాలించు క్షత్త్రియుఁ డతఁడ ;
కడఁగి దుర్భవకర్మఘటవహిత్రంబు
వడి భవాంబుధిఁ ద్రిప్పు వైశ్యుండు నతఁడ;
యిల సత్క్రియారంభఫలములు గోసి
సొలవక నూర్చెడు శూద్రుండు నతఁడ ;
యాదిశక్తియ ము న్ను పాదానముగను
నాదబిందులు గారణంబుగఁ దగిలి
వేడుక బ్రహ్మాండవివిధభాండములఁ
గూడ వానెడు నాఁటికుమ్మరి యతఁడ ; 120
హరియెమ్ము దండంబు నహిపతి ద్రాడు
నరసింహు పెనుపగునఖకంబు గ్రొంకి
యవనిమోచినవరాహం బెఱ గాఁగ
నవనిఁ గూర్మంబును నల్లమత్స్యంబు
గాలమి ట్లేకోదకంబునఁ దిగిచి
లీల నటించునాజాలరి యతఁడ;
చటుల సంసృతి జీవఘటచక్రకర్మ
పటుపరివర్తనభ్రమణంబుఁ గూర్చి
కీలు వొందించి యాక్రియ రాటనముల
వాలి యాడించు నావడ్రంగి యతఁడ ; 130
మును జీవ మను లోహమునకు జ్ఞానాగ్ని
నొనరఁగఁ బదనిచ్చు కనుమరి యతఁడ.
యిచ్చుచో నెఱిఁగి కల్లచ్చుల నూకి
యచ్చుల నొరగొను నగసాలి యతఁడ,
హరిణ మై రమియించు నజునిశిరంబు