పుట:Dvipada-basavapuraanamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

139

వల దభిమానంబు వొలిపుచ్చుకొనకు :
మిల నొరులేల నీ వెత్తిపోయినను
జుట్ట వ్రేలను జక్కఁ జూపఁగఁగలవె ?
యట్టేల ? వల." దన్నఁ గట్టుగ్రుఁ డగుచుఁ
“గారణంబులుఁ గథల్ గల్పింప కిచట
నూరక చూచుచు నుండు మీ" వనుచు 170
బసవని వారించి పాపాత్ముఁ డంత
వెస యామికులఁ జూచి "వే ఱుపాయమునఁ

—: బిజ్జలుఁడు మాచయ్యను జంప నేనుఁగుఁ బంపుట :—


దొలఁగ కాతఁడు వచ్చుత్రోవన మీరు
తలఁగ కాతనిఁ దలతలమని నిలిచి
సమదాంధగంధగజంబుఁ బై కొలిపి
సమయింపుఁ” డనవుడు జను లుత్సహింప
మావంతు లేఁగి సామజముఁ బై కొలిపి
యావీరవరురాక కరికట్టి నిలువ-
నల్లంతఁ బొడగని యార్చి బొబ్బిడుచుఁ
“గల్లి నాథుని భద్రగజమొక్క నరుని 180

—: మడివాలు మాచయ్య యేనుఁగును జంపుట :—


యేనికదున్నకు నేల పంకించు
మానవు ల్చావక మగుడుఁడో" యనుచు
గంటయుఁ గొడుపును గదియింపఁ దడవఁ
బంటించె నేనుఁగు బలమెల్ల నవిసె.
నంతటఁ బోక మానవంతులు నూక
నంతంత డగ్గఱు నంతకుమున్న
వెన్నున నెలకొని యున్నవస్త్రములు
ననభోమార్గంబునం దిఱియించి
చేతిగంటయు నంద చేర్చి మైవెంచి
చేతులు సమరుచు నేతెంచి చూచి 190
దండి యై మాంవంతుతండంబుఁ జంపి,