పుట:Dvipada-basavapuraanamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

శ్రీగురులింగసుస్థిరదయాపాంగ !
యోగాత్మ ! భక్తిమహోత్తుంగ ! సంగ :

—: మడివాలు మాచయ్య కథ :—


మఱియును మడివాలు మాచయ్య నాఁగ
నఱలేని వీరవ్రతాచారయుతుఁడు
శ్రేష్ఠుఁడు జంగమప్రష్ఠుఁడు న్యాయ
నిష్ఠురాలాప మహిష్ఠమండనుఁడు
నిష్ఠితేంద్రియగుణాన్వితుఁడు లింగైక్య
నిష్ఠాపరుఁడు సుప్రతిష్ఠితకీర్తి
భవిజనసంసర్గపథపరిత్యాగి
ప్రవిమలతత్త్వానుభవసుఖాంభోధి 10
పరగు భాషా వ్రతపాలనశాలి
దరితషడ్వర్గుఁ డాస్థానంబుజ్యోతి
రజకజాత్యావృత ప్రత్యక్షరుద్రుఁ
డజరామరుం డయోనిజుఁ డవ్యయుండు
శరణపదాంభోజ షట్పదుం డనఁగఁ
బరఁగి, హిప్పరిగె యన్పురవరంబునను
నుండంగ, బసవనియురుభక్తి వార్ధి
నిండారి దెసలను నిట్టవొడుచుడుఁ
బొంగి లింగానందపూరితుం డగుచు
జంగమదర్శనాసక్తి నేతెంచి 20
బసవనిచేఁ బ్రణిపత్తి గైకొనుచు,
నసమజంగమకోటి కర్చ లిచ్చుచును,
బంటింపక వరువుఁబనులు సేయుచును,
గంటి నాచేతులకసివోవ వనుచు