పుట:Dvipada-basavapuraanamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

బసవపురాణము

ఇది యసంఖ్యాతమాహేశ్వరదివ్య
పదపద్మ సౌరభభ్రమరాయమాణ
జంగమలింగ ప్రసాదోపభోగ
సంగత సుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ
సుకవిప్రణీత మై శోభిల్లి తనరి
చరలింగ ఘనకరస్థలి విశ్వనాథ
పరకృపాంచితకవిత్వస్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మను కథయందు
ననుపమంబుగఁ దృతీయాశ్వాస మయ్యె. 1550


___________