పుట:Dvipada-basavapuraanamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

బసవపురాణము

బాస వట్రిల్ల సద్భక్తసంఘంబు
మాసినవస్త్రముల్ మఱి మోసికొనుచు
వేవుజామున నేఁగి వేఱొక్క రేవు
గావించి యుదుకుచు ఘట్టనల్ సేసి
శస్త్రసమేతుఁ డై సద్భక్తవితతి
వస్త్రముల్ రజతపర్వతభాతిఁ దాల్చి 30
వరిగొనివచ్చుచోఁ బురవీథి “భవులు
శరణులవస్త్రముల్ సంధిల్లి రేని
నోడఁ జాఁ బొడుతుఁ జుండో " యనిఘంట
నాడాడ వ్రేయుచుఁ గూడఁ జాటుచును
మఠమున కేతెంచి [1] మణుఁగు లన్నియును
గఠినము ల్గాకుండ ఘట్టించి మడువ
నట్టిచో జంగమం బరుదెంచి యడుగ
నెట్టి [2]కట్ణం బైన నిచ్చి మ్రొక్కుచును
నావస్త్రముల వార లడుగవచ్చినను
లేవన కందిచ్చు లింగసంపదను. 40
అంత నద్భుతచిత్తుఁ డై బసవండు
సంతతంబును విని సంస్తుతుల్ సేయ
“నలిభక్తతతివలువ లుదుకుచాకి
విలసితభక్తియు నిలఁ జెప్పఁబడియె
నదిగాక యేకాకి యన్మడివాలు
సదమలభక్తి భాషయు నొప్పెఁ గాని
యిట్టిసద్భక్తి యు నిట్టిమహత్త్వ
మిట్టి సామర్థ్యంబు నెఱుఁగ మే" మనుచు
సల్లీల ననిశంబు సంస్తుతు ల్సేయఁ
దెల్ల గానటు గొన్నిదినములు సనఁగఁ, 50
బఱతెంచుచో ముట్టుపా టైన నొకని
నఱిముఱిఁ జంపి మాచయ్య యున్నెడను.

  1. తెలుపు చేసిన బట్టలు
  2. వస్త్రము.