పుట:Dvipada-basavapuraanamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

బసవపురాణము

బరమాత్మ !" యని విన్నపం బాచరింప
నభిమతార్థప్రదుఁ డట్ల కన్నప్ప
కభిముఖుఁ డై నిల్వ నంత నిద్దఱును
వెలయఁ దా రన్యోన్యవీక్షణానంద
కలితాత్ము లై తిరుకాళ త్తిపురిని 1260
గన్నప్ప దేవుఁడు గౌరీశ్వరుండు
సన్నిరీక్షణలీల నున్నవా రిపుడు ;
నిక్కంబు గన్నప్ప పుక్కిటినీరు
ముక్కంటి కభిషేకమున కెల్ల వ్రొద్దు
నేఁడును గన్నప్ప నిర్మాల్యమందుఁ
బోఁడిగా శివునకుఁ బూజసేయుదురు;
మృడుఁడు గన్నప్ప కర్పించినఁగాని
యడరంగ నేఁడును నారగింపండు ,
క న్నర్పితము సేసెఁ గాన లోకములఁ
గన్నప్పఁ డనఁగ మహోన్నతి కెక్కె ; 1270
నచ్చట నేఁడు గన్నప్పండు శివుఁడు
నచ్చెరు వందంగ నట్లున్నవాఁడు.
కావునఁ దొల్లి ముగ్ధస్వభావులకు
దేవుండు కృపసేయుఁ దెల్ల మి” ట్లనుచు
బసవయ్య ముగ్ధగణసమూహికథలు
పసరింప నాచెన్న బసవయ్య వినఁగఁ
“బృథివి నీముగ్ధులకథలు దాఁ జెప్పఁ
గథ లయ్యె" నని కథకథకు నవ్వుచును
నతులితానందసంగతి నున్న భక్త
వితతికి బసవఁ డున్నతలీల మ్రొక్కి, 1280

—: కళియంబనాయనారు కథ :—


“యిప్పురాతనులందు నెఱుఁగరే తొల్లి
యొప్పార నిత్యంబు నొక్కభక్తుండు
నలిరేఁగి కళియంబనయనా రనంగ