పుట:Dvipada-basavapuraanamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

121

నీదేవుఁ డితనిప్రసాదంబుఁ గుడిచి
వేదశాస్త్రముల వివేకంబు గడఁచె.
శివుఁడు గన్నప్పయుచ్ఛిష్టంబుఁ గుడిచి
యవికలవిధి ని షేధాతీతుఁ డయ్యె ; 1230
లింగంబు గన్నప్ప యెంగిలి గాన
యంగ మంతయు నుత్తమాంగ మై యొప్పె :
గణనాథుచేత లింగసమేతుఁ డయ్యె ;
గణుతింప నంబిచే ఘనభక్తుఁ డయ్యె :
సన్నుతి కెక్కి మాకన్నప్పచేత
సన్నుతసర్వప్రసాదాంగుఁ డయ్యె :
ననుచు భక్తానీక మసమానలీల
వినుతింప, జగములు విస్మయం బంద.
నన్నగజాధీశుఁ డంత నందంద
కన్నప్ప దేవునిఁ గౌఁగిటఁ జేర్చి 1240
“పరఁగుచతుర్వర్గఫలము లాదిగను
వర మిత్తు నడుగుము వాంఛితార్ధమ్ము"
లనవుడు మందస్మితాననుం డగుచు
ననుషక్తి ముకుళితహస్తుఁ డై మ్రొక్కి
“యెఱుఁగ మోక్షములపే రెఱుఁగ వాంఛితము
లెఱుఁగ వేఁడెడుమార్గ మెఱుఁగ నేమియును
ఎఱుఁగుదు నెఱుఁగుదు నెఱుఁగుదు మఱియు
మఱియును మఱియు ముమ్మాటికి నిన్న
కావునఁ గోరికి కడమయుఁ గలదె ?
దేవ ! మూలస్తంభ దివ్యలింగాంగ ! 1250
నీయతులితదయాన్వితదృష్టి యిట్లు
నాయందు నాఁటి కొనలు వసరింప
నాదగు సంస్పృహాపాదితదృష్టి
నీదృష్టిలోనన నెక్కొని పొదలఁ
గరుణింపు : దక్కిన వరము లే నొల్ల