పుట:Dvipada-basavapuraanamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

123

నిల మిమ్ము నగియించు నిదియె నేమముగ
మొచ్చించె శివదేవు మీ రొక్కమాటి
కిచ్చ నవ్వుట సాలదే నన్ను మనుప !"
ననుచు నవ్వించుచు నవిరళభక్తి
జనితసుఖామృతవనధిఁ దేలుచును.
బసవఁడు జంగమప్రకరంబు నిట్టు
లసలార నోలగం బై యుండి రంత. 1290

—: సకలేశ్వరు మాదిరాజయ్య కథ :—


“పెద్దలఱేఁడు , వెన్నుద్దుల మొదలు
బుద్దుల ప్రోక , విబుధనిధానంబు,
నమితవచోరాశి, సుమనోనురాగుఁ,
డమలినచిత్తుఁ, డుద్యద్గుణాన్వితుఁడు ,
సకలవీణాప్రవీణకళా విదుండు,
నకలంకనాదవిద్యాపండితుండు ,
వేదవేదాంత సంపాదితతత్త్వ
వాది, సంసారదుర్వ్యా ప్తిసంహారి,
యమనియమాదివ్రతాచారవ ర్తి,
శమదమసద్గుణాశ్రయచరిత్రుండు, 1300
ధీరమహోదారదిక్పూర్ణకీర్తి,
కారుణ్యమూర్తి, నిర్గతసకలార్తి,
మహితసజ్జనశిఖామణి నాఁగఁ బరఁగు
మహి సకలేశ్వర మాదిరాజయ్య
గారి సద్భక్తి విఖ్యాపిత మహిమ
ధారుణి నె ట్లన్నఁ దా విస్మయంబు 1
నగణితకీర్తిమై నంబె యన్పురము
దగు రాజధానిగా ధరణి యేలుచును
శ్రుతి వీర్య వితరణ రూపవివేక
చతురతరూఢి రాజ్యంబు సేయుచును 1310
జంగమలింగైక్యసద్భక్తియుక్తి