పుట:Dvipada-basavapuraanamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

బసవపురాణము

నంగీకరించుచు నర్చ లిచ్చుచును
నొడఁబడ రాజవదుపచారములను
గడియగడియ దప్ప కెడ భజింపుచును
వివిధపుష్పదళ సద్భవనాంతరమున
శివదేవు సంస్తుతి సేయుచు న్నంత ,
రమణ బత్తీసాదిరాగంబులకును
నమర నన్నియు దండియలు నియోగించి
యేరాగమున నకలేశున కర్థి
యారాగవీణ దా నలరి ధ్వనింప, 1320
విరచిత స్త్రీరాగపురుషరాగములు
సరస మై లక్ష్యలక్షణనిర్వికార
పూరితనాదగంభీరవినూత్న
సారోక్తిగీతంబు లారఁ బాడుచును
దమతమ కఖిలవాద్యంబులు మ్రోయఁ
గ్రమ మొందఁ గేళికగతి నటింపుచును
వారివారికి హర్షపూరము ల్గాఁగఁ
గోరి భక్తాలి కింపార మ్రొక్కుచును
బాయక రేయును బవలు లింగార్చ
నాయతామృతవార్ధియం దోలలాడ 1330
నఖిల సామ్రాజ్య సమంచిత సరస
సుఖముల కెమ్మెయి సొగయ కున్నెడను
'మల్ల రసను నొక్క మండలేశ్వరుఁడు
దొల్లి యిట్టుల రాజ్య మొల్లక విడిచి
శ్రీగిరి కేఁగి నిశ్చింతాసమాధి
నాగిరి బిల్వవనాభ్యంతరమున
నున్నవా' రని వారియురుభక్తిగుణమ
హోన్నతికయు ధ్యానయోగసంపదయు
శివభక్తితత్త్వానుభవసమగ్రతయు
శివభక్తిగణములచే వినఁబడుడు- 1340