పుట:Dvipada-basavapuraanamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

115

గానోపు నక్షిరోగంబ యేమేని
చెప్పఁ జిత్రము [1] గోడిఱెప్ప వెర్గినదొ?
తప్పవోనోపునో ! తడికంటివిధమొ ?
నొవ్వియో పొరగప్పెనో ? మాదతెవులొ ?
పువ్వువట్రిల్ల నాపువుకంటి పోటొ ?
మయిలవడ్డదియొ ? దుర్మాంసదోషంబొ ?
అయిరయో వెండియు నక్షిరోగంబొ ?1060
కానోపు ని ట్లనుమానంబు లేదు ;
దీనికి మందుమ్రా కే నే మెఱుంగ ;
నాయన్న ! నాతండ్రి ! నాయిష్ట సఖుఁడ !
నాయయ్య : నాజియ్య : నాప్రాణనాథ :
సర్వాంగసుందర ! శంకర ! యీ! వి
గుర్వణం బెటు దొరకొనెనయ్య ! నీకు :
ముక్కంటి వాఁడని మూఁడు లోకముల
నిక్కంబు వెఱతురు నిటలలోచనుఁడ !
యెన్నఁడు నీకొక బన్నంబు లేదు ;
గన్నుఁ జూచిన నిట్టు గైకొండ్రె సురలు ; 1070
కంటి చిచ్చున మున్ను గాలిన వారు
కంటివార్తకు నిఁక గనలరే మగుడ :
విను మెంత గన్ను గానని వలపైన
వనిత లి ట్లంగహీనునకు జిక్కుదురె ?
రూపింప నిట్లు కురూపి వై యున్న
నేపార భక్తు 'లిహీ ' యని నగరె ?
నేఁ డెందుఁ బోయేనో నేత్రంబు హరికి
నాఁ డిచ్చి నట్టి యనశ్వరమహిమ ?
పొలమున నాఁబోతు పులి గొన్నయట్టి
పొలు పయ్యె నే నెట్లు నిలువంగనేర్తు : 1080
నెవ్వరి కెఱిఁగింతు ? నెట్లు ధరింతు ?

  1. విగుర్వణము = మితిమీఱిన కష్టము.