పుట:Dvipada-basavapuraanamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

బసవపురాణము

నెవ్విధిఁ బోపుదు ? నేమి సేయుదును ?
జెప్పంగ లే దొండు ; సేయ లే దొండు ;
నిప్పాటఁ జూచుచు నే నుండఁ జాల ;
నాకంటఁ బుట్టిన నాఁటను గోలె
శ్రీకంఠు రోగంబు సెంద దెన్నఁడును :
నొప్పని కన్నుతో నున్నట్లు గాఁగఁ
గప్పెద నాలెస్సకంట నీకన్ను ;
నాకన్నచూ ! మందు నీకంటి" కనుచుఁ
జేకొని శరమున ఛేదించి పుచ్చి 1090
కఱకంఠు కంటిపైఁ గన్నప్ప దేవుఁ
డఱిముఱిఁ దననేత్ర మర్పింపఁ దడవ
నక్కంటఁ దొరుగు ధారావళి యడఁగి,
గ్రక్కున డాపలికంట నుప్పొంగఁ
గించి త్ప్రహాస సంకీలితాననస
మంచితాంభోజాతుఁడై తననేత్ర
కమలంబు శివునేత్ర కమల మై యునికి
కమితమహోత్సాహ మాత్మఁ దుల్కాడఁ
గ్రేకంట లింగంబు డాకన్నుఁ జూచి
‘యీకంటి కిని మందు నీకన్నె కాక 1100
యనుమాన మింకేల' యనుచుఁ దన్నే త్ర
జనితవినిర్మలజలధార దొరుగఁ
గందువఁ దనచెప్పుఁ గాలి యుంగుటము
వొందించి డాకన్ను వుచ్చఁ గై కొసుడు-
నంతలోపలన ప్రత్యక్ష మై యప్పు
డంతకసంహారుఁ డనురాగ మెఁసఁగఁ
గన్నప్పదేవర కరయుగ గ్రహణ
సన్నుత హస్తుఁ డై చక్కన నిలువఁ-
గలిత సమావలోకనమాత్ర యంద
యలరెఁ గన్నప్పని వలపలి కన్ను 1110