పుట:Dvipada-basavapuraanamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

బసవపురాణము

నువిద గావించు బాల్యోపచారములు.
శ్రుతి “యేకయేవ హి రూపేణ"యనియు
స్మృతి “సాధక స్సంస్మరే త్సదా "యనియు
ధన “తస్య తన్మయతాంయాతి "యనియు
హరునివాక్యము గాన యది యేల తప్పు ?
భక్తుఁ డెబ్బంగిగా భావించు శివుఁడు
వ్యక్తిగాఁ దద్రూపుఁ డై యుండు టరుదె ? 630
యని భక్తమండలి వినుతింపఁ గొన్ని
దినములు సనఁగ నద్దేవదేవుండు
వెండి యమ్మకుఁ బ్రసన్నుండు గాఁ దలఁచి
దండిరోగంబైన తఱుచంటిక్రియను
జన్నును గుడువక సంధిల్ల నోరు
వెన్నకుఁ దెఱవకయున్న యాక్షణమ
బి ట్టుల్కిపడి తల్లి బిమ్మిటి నొడలుఁ
బట్ట లే కాపద గిట్టి “నాయన్న !
నాకున్న : నాపట్టి : నాచిన్నవడుగ !
నాకుఱ్ఱ చ న్నేలరా కుడ్వవై తి ? 640
నీచెమటయుఁ జూచి నెత్తురు నవుదు
నోచెల్ల ! యెటు సూడనోపుదునన్న :
తల్లి ఁ గదన్న ! యింతటి కో ర్తునన్న !
యెల్లెడ నొరుల నే నెఱుఁగఁగదన్న !
కలిగితి లేక యొక్కఁడవు గదన్న !
తలరక యే నెట్లు దరియింతునన్న !
నేలపై నాకాళ్లు నిలువవురన్న !
యేల పల్కవు సెప్పవే యన్న : నీకు
నఱిమియో ? కోవయో ? యంగిటిముల్లొ !
యెఱుఁగను మందుమ్రాఁకేమియు" ననుచుఁ 650
బనవుఁ బలవరించుఁ బయిఁ బడి పొరలుఁ.
గనుఁగొను మైవుడ్కుఁ, గౌఁగిటఁజేర్చు.