పుట:Dvipada-basavapuraanamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

101

గప్పుఁ, దెఱచుఁ, గప్పుఁ, గ్రమ్మఱఁ దెఱచుఁ ,
దప్పక వీక్షించుఁ, దల్లడం బందుఁ
బొంగెడుఁగడువుముప్పునను 'బొప్పనికి
నంగిటిము ల్లయ్యె' నని నరు లనఁగ
నడలుచుఁ గడుశోకజడధిఁ దేలుచును
బడఁతి పుత్త్రుం డున్న భావంబుఁ జూచి...
“కడుపు వెలితి యైన నొడయనంబికిని
నెడవోయి యచ్చటఁ గుడువలేకున్నఁ 660
గునియుచుఁ గుమ్మరగుండయ్య వాద్య
మున కాడి యచ్చటఁ గొనఁ దిన లేక
వచ్చి చేరమచక్రవర్తి వాయింప
నచ్చెరువుగ నాడి యాఁకట బడలి
“పెడయాట లివియెల్ల వేఁగి యాడినను
గడుపు నిండునె' యని గ్రక్కున వచ్చి,
పిట్టవ్వకై రాచవెట్టికిఁ బోయి
యెట్టకేలకు నింతపి ట్టారగించి,
సామవేదులయింటఁ జచ్చినపెయ్యఁ
బ్రేమంబుతో వండి పెట్టంగఁ గుడిచి, 670
కామింపఁగాఁ గరికాళవ్వయింట
మామిడిపండులు మఱుఁగున నమలి,
పోయి చెన్నయయింటిఁబులియంబకళముఁ
జేయుఁ దీయక జుఱ్ఱి, చిఱుతొండనంబి
కొడుకుమాంసము వేఁడికొని విందుసేసి ,
యెడపక నిమ్మవ్వయింట భుజించి,
యారగింపఁగఁ జవి యైనఁ జోడవ్వ
కోరతో నిచ్చినఁ గొని యారగించి,
యాసక్తి సురియచౌడయ్య చేకళ్ల
కాసించి తఁట ! వెండి యంతటఁ బోక 680
నిన్న నింతయు నొక్క నెలఁతుక సెప్పెఁ ;