పుట:Dvipada-basavapuraanamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

99

వెగచి బెగడకుండ వెన్ను వ్రేయుచును
నొగి మస్తకమున నీ రొత్తు దోయిటను ;
వదనంబు సొచ్చునో యుదకంబు లనుచు
నదుముఁ బొట్టను నోరి కడ్డంబుపట్టుఁ ;
జెన్నుగాఁ బనుపార్చి చేయు మజ్జనము
గన్నులుఁ జెవులును గాఁడంగ నూఁదు; 600
సంగిటిము ల్లొత్తు నందంద వ్రేల
దొంగిళ్లఁ గార్నీరు దోనెత్తి మిడచు;
బడఁతిచే నీరఁ దూపొడిచి బొట్టిడును ;
మడఁది యంగుష్ఠంబుమ న్నింత మెదిచి
కడవ నంటినయట్టి పిడుకవిభూతి
యడరఁ బుత్త్రుని నొసలారంగఁ బూయు;
నెత్తు గ్రుంగెడు నని యెత్తంగ వెఱచి
యత్తన్వి ఱొమ్మున నక్కున నదుము ;
కాటుక యిడ నింత గన్నగు ననుచుఁ
గాటుక యిడు మూఁడుగన్నులఁ గలయఁ ; 610
జన్నిచ్చుఁ ; బక్షులఁ జననీదు మీఁద;
నన్నాతి గొండొక వెన్నయుఁ బెట్టుఁ ;
జెక్కిలి గీఁటుడుఁ జెలఁగి యేడ్వంగ
నొక్కవే లిడి పోయు నొకకొన్నివాలు
ఉగ్గులువోసియు నువిద సంప్రీతి
నగ్గించు నొగియించు నట బుజ్జగించు
ముద్దాడు నగియించు ముద్దులు వేఁడు ;
నద్దికొన్ వీ రెవ్వ రయ్యరో యనుచుఁ
బన్నుగా నుదరంబుఁ బాన్పుగాఁ జేసి
కున్న జోసఱచుచు సన్నుతిఁ బాడుఁ " 620
గొడుకని యిబ్బంగిఁ గొనియాడుచుండఁ
బడఁతి నిశ్చలముగ్ధభావంబునకును
శివుఁడును మెచ్చి తాఁ జేకొనియుండె