పుట:Dvipada-basavapuraanamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

బసవపురాణము

పట్టును రత్నంబుపట్టును సంకు
పట్టును మరకతపట్టు పొంబట్టు 110
నెఱపట్టు వెలిపట్టు నేత్రంబుపట్టు
మఱి తవరాజంబుమాందోళిరవియుఁ
జంద్రాతపంబును సాంధ్యరాగంబు
నింద్రనీలంబు మహేంద్రభూషణము
సన్ననడంచును శరధియు మేఘ
వన్నెయు రుదాక్షవన్నె కాంభోజి
పులిగోరుపట్టును భూపతి రుద్ర
తిలకంబు సరిపట్టు మలియజసిరియు
గొలవిమేఘము గజావళి హయావళియు
వలిపంబు సరి గమ్మితెలుపు దివ్యాంబ 120
రంబును నుదయరాగంబు దేవాంబ
రంబు పొత్తియు గుజరాష్ట్రంబుపట్టు
మొదలుగా నెఱుఁగమే మును దరతరమ
పదపడి మనవారు వడసినయట్టి
మానితవస్త్రవితానముల్ గలవు
గాని యావస్త్రసమానముల్ గావు:
తథ్య మిట్టిద” యని దాసి సెప్పుడును
మిథ్యసేయక వేశ్య మిండనిఁ జూచి
నలి దలిర్పఁగ “నీవు నా తోడివలపు
గలవేని బసవయ్య కాంత గంగాంబ130
కట్టినపుట్టంబుఁ గ్రక్కునఁ దెచ్చి
నెట్టణ నా కిమ్ము నేర్పు దలిర్ప"
ననవుడు “నట్లకా” కనుచు మిండండు
సని కాంచి "బసవ ! నీవనిత గంగాంబ
కట్టినపటవలిపుట్టంబు మాకు
వి ట్టున్న భంగిన యిప్పింపవలయు."
ననవుడుఁ దనసతి నాస్థానసదన