పుట:Dvipada-basavapuraanamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

83

మునకుఁ బిల్వఁగ బంచి ముద్దియఁ గదిసి
“పుట్టు సా వెఱుఁగని యట్టిమహాత్ముఁ
డిట్టలంబుగ నీదుపుట్ట మడ్గెడిని : 140
పుట్ట మీవేగ ; మీపుట్ట మిచ్చినను
బుట్టము మన" మని యట్టిచందమున
లజ్జయు సిగ్గు దలంపక బసవఁ
డ జ్జలజాక్షివ ల్వఱిముఱిఁ బట్టి
యొలువంగ నొలువంగ నొక్కవస్త్రంబు
దళితాంబుజాననమొలఁ బాయకున్నఁ
గనుఁగొని యద్భుతాక్రాంతాత్ము లైన
జనములఁ గనుఁగొని జంగమం బనియెఁ
“గహనమే చూడ జగద్ధితసూత్ర
సహజవాహను లగు శంభుభక్తులకు ? 150
నలి నిడిగుడినయనా రను భక్తుఁ
డిల నాలిచీర లొల్చీఁడె భక్తులకుఁ ?
బండ్రెండువర్షముల్ వాయక నేసి
పండ్రెండుమూరల పసిఁడిపుట్టంబు
విపరీతగతిఁ దన్ను వేఁడుడు నొక్క
దససికిఁ దేడరదాసయ్య యీఁడె ?
యది గాక [1]బల్లహుం డఖిలంబు నెఱుఁగ
సదమలచిత్తుఁడై సతిని మున్నీఁడె ?
యఱలేక రూపించి యడుగంగఁ దడవ
మఱమొన్నయధరుండు మాణిక్య మీఁడె ? 160
నండియై మొన్న యధరుఁ డిమ్మడించి
మిండభక్తునకు నర్మిలి నర్థ మీఁడె?
మహి నిడుగుడిని బెర్మాణి యన్ [2]గణము
గహనంపుదుర్భిక్ష కాలంబునందుఁ

  1. భళ్ళాణరాజు (ఈ పదము సాధారణముగా ప్రభువు (రాజు) అను నర్ధముననే పూర్వవాఙ్మయమున నుదాహృతమయినది).
  2. భక్తుఁడు.