పుట:Dvipada-basavapuraanamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

బసవపురాణము

సువిధాని కక్కయ్య పోభువి జాలాగాఁడు
శివరాత్రి సంగయ్య : సిలి బోగతందె ,
దేవరదాసయ్య దేవ ! దాసీఁడు ;
భావింపఁ గిన్నర్రబహ్మయ్య బచ్చు ;
మడివాలు మడివాలుమాచిదేవయ్య ;
కడమలనంబి సొప్పడ దివ్వెలాఁడు ;
తెల్లంబు గోడలు దీర్చెడువాఁడు
సల్లీల గోడలమల్లయ్యగారు :
కుమ్మరి గుమ్మరగుండయ్యగారు ;
జొమ్మయ్య వేఁటకాఁ డిమ్మహిలోనఁ ; 590
గమ్మరమ్ములవాఁడు ఘనుఁ డిల్ల హాళ ;
బొమ్మయ్య [1]గీలారి నెమ్మిఁ జండండు ;
మాయావి : బల్లేశుమల్లయ్య గొట్టు
బోయీఁడు; బాచయ్య భూరికొటారి ;
పాలువిదుకువాఁడు లీల వంకయ్య :
పాలుగావంగ నేర్పరి గొడగూచి ;
కావున నీదు సకలనియోగంబు
మావార లై యుండ మన్మనోరమణ !
యేమిటఁ గొఱుత ? నా కేమిటఁ గడమ ?
యేమైన నడుగు నీ కిచ్చెద నింకె 600
మానంబు వదలిన మదిఁ దల్ల డిలిన
మానుగాఁ బ్రమథులయాన ! నీయాన !
కాలకూటము గుత్తుకకు రాకమున్న
క్రాలుపురంబులు గాలకమున్న
గౌరివివాహంబు గా కటమున్న
యార నజాండంబు లలరకమున్న
తిరిగి మూర్తులు నెన్మిదియు లేకమున్న
భువి హరిబ్రహ్మలు పుట్టకమున్న

  1. కిలారి - వసులకాపరి.