పుట:Dvipada-basavapuraanamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

69

యటమున్న యటమున్న యటమున్న మున్న
యిట నీవు నాస్వామి ; వేనునీబంట ; 610
కఱకంఠ ! యిది యేమ గళవళించెదవు
వఱల నాచేతఁ బోవచ్చునే?" యనుచు
నసమాక్షుతోడ మాఱంకమై గెలిచె
బసవఁ డుద్యద్భక్తిభాతిమై నిట్లు.

—: బసవఁడు గొల్లెతచల్లకడవఁ బడకుండఁ బట్టిన కథ :—


వెండియు నిర్మలాఖండితకీర్తి
దండనాథాగ్రగణ్యుండు పుణ్యుండు
సజ్జననుతుఁడు బసవఁ డొక్కనాఁడు
బిజ్జలుకొలువునఁ బ్రీతిఁ గూర్చుండి
“యోడకోడకు "మని యొకకడ వెత్తు
మాడికి బాహుయుగ్మముఁ జాఁపఁ దడవ 620
“నిసుమంత బూడిద నొసలఁ బూసినను
మసలక కొండంతమరు లెత్తె ననుట
తెల్లం” బనుచు రాజు మెల్లన నగుచుఁ
"జెల్లఁబో బసవయ్య ! శివమరుల్ గొంటె
బ్రమసితే తలకెక్కి భక్తిరసంబు
గుమతివై నిండినకొలువులోపలను
“నోహో” యనుచు “నోడకోడకు" మనుచు
బాహుయుగ్మము సాఁచిపట్టుటే” మనిన
“స్వగుణసంకీర్తన దగదు సేయంగఁ
దగదని యున్నను నగు సభ యనుచుఁ 630
“ద్రిపురారిగుడీతూర్పుదెస నేఱునేలఁ
గపిలేశ్వరంబందుఁ దపసి యొక్కరుఁడు
ఆలింగమునకు నిత్యము నాఱువుట్ల
పాల మజ్జనమార్పఁ గాలువల్ గట్టి
వీదివీదుల వెల్లి విరియ నేనుఁగుల
పాదఘట్టనములఁ బంకంబు రేఁగ