పుట:Delhi-Darbaru.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహమహోత్సవము.

73


విధిగను జయ ప్రదముగను ముగింపునందెను. ప్రజలందఱును దమ తమ కుచితమగు విధమున నీ మఘోత్సవ 'కాలమున సంతోషమును' గనుపఱచి. తనకు నైజమగు సుస్వభాన మును వెల్లడించుచు, తన మనుమఁడగు యార్కు ప్రభువు కును, ఒక్కు రాకోమరితె యగు విక్టోరియా మేరీకిని జరగిన వివాహ సమయమునఁ బ్రజలు - దన యెడలను దన దన సంతతి యెడలను గనుపఱచిన విశేష ప్రేమాభ క్తులు మనస్సునకు హత్తి మహా సంతోష ప్రీతుల నిచ్చెనని విక్టోరియా రాణిగారు దెలియఁ జేసియున్నారు.ఇది రాణీగారి కొక క్రొత్త సంగతి గాదు.సుఖమునఁగాని దుఃఖమునఁ గాని యామెయెడ గాఢమగు సానుభూతి యెల్లరును గనుపింపఁ జేయు చుఁడుటా యమ మనమున సంపూర్ణముగా నంటినదే. తమ సుఖదుఃఖములయం దా యమ హృదయమేంత గాఢ ముగ నిమగ్నమగునదియు వారెరుంగుదు రని యామెకుఁ దెలియును. సామ్రాజ్యమందలి సర్వప్రజలకును నామెకును నీపరస్పర సంబంధ ముండుటయె సామ్రాజ్యమునకు నిజమగు బలము. పౌరులతో గూడ ' రాణిగారును దన మనుమఁడును మనుమరాలును జిరాయు రైశ్వర్యముల నందుదురు గాతమని పరమాత్వుఁ బ్రార్థించుచున్నది." యని ప్రజల యనురాగ మునకు ప్రత్యుత్తరముఁ బ్రక టింపిం చెను.