పుట:Delhi-Darbaru.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

శ్రీరాజ దంపతులు..


జార్జి రా జ కా ర్య పరిశ్రమ

వివాహానంతర మేడుసంవత్సరముల కాలము మేరీ ప్రభ్వి జూర్జి ప్రభువుల జీవనమం దొక్క విభాగముగఁ గానవలసి యున్నది. 1894న సంవత్సరము జూను నెల 28న తేది వీరి ప్రథమ పుత్రుఁడు పుట్టి విక్టోరియా మహారాజికిఁ దనకుఁ దరువాత మూఁడవ తరపురాజును జూడఁగల్గు సంతోషమును గలిగించెను. ఈ శిశువునకు ‘ఎడ్వర్డ్ ఆల్బర్ట్ క్రిశ్చియఁన్ జార్జ్ ఆన్టూ పాట్రిక్ డేవిడ్ ' అను నామకరణ మొనర్చిరి. మాచదు వరు లీపొడనగు పేరేల యిడఁబడెనని యాశ్చర్యపడుచున్నారు గాఁబోలు. బ్రిటిషు దీవులలోని ప్రతి భాగమునకును సంరక్షుణ కర్తయగు ఋషి యొకఁడొక్కరుఁడు గలఁడని వాడుక. అట్టి ఋషులందఱను స్మరియించుఁ దలంపుతో నింత పెద్ద పేరు. కాని సర్వసాధారణముగ నీ బిడ్డని డేవిడ్ అనియే పిలుతురు. 1895 వ సంవత్సరమునఁ దూర్పు ఆశియా యందు చీనా చరిత్రమందు బాక్సరు విగ్రహమని పేరుఁగనిన యుద్ధము ప్రారంభమయ్యెను. దానియందు జార్జి కెక్కుడు దృష్టిదగిలి యచ్చటి సమాచార ములను జాగరూకుఁడయి చదువుచుండెను. ఆసంవత్సరము ఫిబ్రవరి మాసముననే యితఁ డున్నత తపాలాస్థానమును జూచి యాంగ్లేయ తపాలా పద్ధతుల నన్నిటినియు మత పాలాధ్యక్షుని సాహాయ్యము చేఁ బరీక్షించెను. ఇంచుమించుగ నీ కాలమున నె యితని తండ్రియగు వేల్సు ప్రభువు గొంచెము గొంచెముగఁ