పుట:Delhi-Darbaru.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రా జ కా ర్య ప రి శ్రమ.

75.


దనకుఁ జేయవలయుఁ గార్యములఁ దన కుమారుని పై నిడ బ్రారంభించెను. రాజ్యము నందలి వేరు వేరు మండలములను జూచి వచ్చుపని యార్కుప్రభువు సేయ వలసిన వాఁడయ్యెను. ఇట్లు దినములు గడువ నీతఁడు రాజ్య కార్యము లెక్కుడు నేర్చు. చుండెను. డిశంబరు నెల 14న తేది యితని రెండన కుమారుఁడు పుట్టెను. అతనికి ఆల్బర్ట్ ఫ్రెడరిక్ ఆర్థర్ జార్జ్ అను పేరిడిరి. 1896వ సంవత్సరముతయు యార్కు ప్రబ్వీప్రభువులు బ్రిటిషు దీవులలోని నాలుగు చెరగుల యండలి. ప్రదేశములను దర్శించివచ్చుటయందుఁ గడపి. కొన్ని యెడల వీర నేక శుభ కార్యములకుఁ బునాది వైచు చుందురు. మఱీ కొన్ని చోట్ల వేన వేలు ధనము వెచ్చించి కట్టించిన పరిశ్రామిక విద్యాలయ ములఁ దెఱచు చుందుఱు. ఇంక గొన్ని పట్లఁ దమ జ్ఞాపకార్థమై యేర్పడిన వైద్యశాలలయందు స్వాగతమంది తమ కృతజ్ఞత బెలుపుచుంద్రు. ఎల్లెడను మనోవాక్కాయ కర్మంబుల నుత్త మోద్యోగముల యెడఁ దమ సానుభూతిని వెలిఁబుచ్చు చుందురు, 1897 న సంవత్సరమున మూఁగి - వారలకును జెవిటి వార. లకును విద్యఁగఱపు సంఘము వారొక విందునడపిరి. ఆసమయ మున యార్కు ప్రభు నగ్రాసనాసీనత్వమున కంగీరించి తన సానుభూతిఁ గనుపఱిచెను. విందుకుఁవిందుకుఁ బూర్వమె యితఁడా సంఘము వారి విద్యా శాలకుఁ బోయి సర్వమును నెఱింగి కొని తన కార్యమునకు సిద్ధపడి యెను. ఒక విద్యార్థి స్వైర