పుట:Delhi-Darbaru.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

శ్రీరాజ దంపతులు


లోని స్వేత భవనమును వీరికి బసకు గా నిచ్చిరి. అచ్చట నుండు నెడ జరగిన యొకటి ' రెండు వృత్తాంతములు వ్రాసినచో మేరీ రాణికి నామె తల్లి పట్టించిన సుగుణము లిట్టివని తెల్లముగాఁ గలదు.

రా కొమారితె మేయును నామె తల్లియు రిచ్చిమండు ఉద్యాన భూములకును బ్రక్కనంగల 'క్యూ' తోటలకును నప్పుడప్పుడు విహారార్థము నెడలు చుండుదురు. అట్లొక్క ప్రాతః కాల సమయమున పోయియుండి యొక ముసలి శ్రీ గట్టె లేరుచుండుటను గాంచిరి. ఆనాడు మిక్కిలి చలిగా నుం డెను. ఆముదుసలి బడలిపోయి యుండుట విశదముగఁ గనుపించుచుండెను. వెంటనే “టెక్కు' ప్రభ్వి దన గొడుగు వంకరతో రెండు శాఖలను ద్రుంచ మొదలిడెను. " మే ' రా కుమార్తె వాని నన్నిటిని బోగుచేసెను. ఈపగిది మంచి కట్ట యేర్పడెను. ముసలిది మహాసంతోషమున దాని నెత్తుకొని యింటికిఁ బోయెను. ఒక నాడు క్యూతోటయందును నిట్టి వి శేష మొక్కటి దటస్థించెను. ఒక దాది ఒక బిడ్డను తోపుడు బండియం దిడుకొని త్రోసికొని వచ్చుచుండెను. అప్పుడామెకు దారి యందుఁ దీగెలకంచె యడ్డమయ్యెను. బహుదూరము వెను కకు దిరిగి పోయిన గాని సరియగు మార్గము గాన రాదు. కావున నామె యాకంచెలో నుండి త్రోపుకుబండిని