పుట:Delhi-Darbaru.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మే రీ బాల్య క్రీడ లు.

65


దూర్చి ప్రయాణము సాగించవలెనని పలుమారు ప్రయత్నిం చెను. కాని యామె ప్రయత్నము ఫలింప కుండెను. దాని నంతయు గమనించి చూచుచుండిన ఒక్కు ప్రభ్వి 'నిలు. నిలు. నేను నీకు సాయము చేయఁగలుగుదును. నీవు బిడ్డనెత్తుకోమ్ము. నేనును నాపుత్రికయు తోపుడు బండెని కంచెను దాఁటిం చెద” మని నుడివి తృటికాలములో నా దాదిని సంతోషపజచి పంపి వేసెను. కాని యా దాదికి మాత్రము దనకిట్టి సాయము చేసిన వారెవ రైనదియును దెలియదు.

మే రాకొమారితకు తలిదండ్రులిచ్చు చిల్లర పైకమున నామె యొక భాగము ప్రత్యేకించి వైచి దరిద్రుల బిడ్డలకు బంచి పెట్టుట చిన్న తనమునందే నేర్చుకొనియెను. ఆప్రాంత నుండిన క్షయరోగియగు మెక బాలునియెడ నీమె చూపిన దయయు సానుభూతియు నింకను నచ్చట విన నగుచున్నది. ఈమె పలుమారు వానిని జూడ: బోయి యా కుటీరమున వానిప్రక్కనఁగూర్చుండి ముద్దులు గులుకుమాట లతో వానిని సంతోష పెట్టుచు సధ్గ్రంథములఁ జదివి వాని వీనులకు విందొనర్చుచు వాని యాయాస ముడుపుచుండెడిది. ఒక యాదిత్య వారము ప్రొద్దుటి వేళ చర్చికి పోవుచు కడపటి పర్యాయము వానిని జూ చెను. ఆమెకప్పటికే యీపసి వానికి మరణము మూడియుంట నిశ్చయముగఁ డెలిసియుండెను, కావున నామె కంట నీరునించి వానిని ముద్దుగొని వానినుండి