పుట:Delhi-Darbaru.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

శ్రీ రాజ దంపతులు.


.

సెలవు పుచ్చుకొనియెనఁట. ఇట్టి వి శేషచరిత్రకలదయి పెరు గుచు నీమె తల్లితో గూడ ననేక వైద్య శాలలును శరణాలయ ములును వీక్షించి బీదల మేలునకై పెక్కు- విధములఁ బాటు పడుచుండెను. మే'రాకొమరితె కిరువది సంవత్సరములకుఁ బై పడి చూచుటకీమె విగ్రహము పొడనయి బహుసుందరమయి యుండెను.ఆ సమయమున నీ మెపాణిని గ్రహించుట కెవరో యొక విదేశపు రాకొమరుఁడు ప్రయత్నించెనను వార్త కొద్దిగఁ గలదు. "కాని యూతని కీమె లభింపద య్యెను. తండ్రి కనంతరము సింహాసనమున కర్హుడయిన జార్జి కోమరుఁ మాచదువరుల కై వేచియున్న వాఁడు.

జార్జి యార్కు- ప్రభువగుట.

క్లారంసు ప్రభువు మరణము చేత తన స్థితియందుఁ గలిగిన ' పూర్తియగు మార్పు, దుఃఖము వలన జార్జి కొక కొంత కాలము చక్కఁగ బోధపడలేదు. కాని త్వరలోనే క్రమ క్రమముగఁ దన భవిష్యత్కర్తవ్యముల నితఁ డెఱింగికొన మొదలిడెను. 1892 న సంవత్సరమున సతఁడు “ఇంహే' పం డితునితోఁగూడ జర్మేనియా యందలి హీడల్బర్గు పట్టణము నకుఁ బోయెను. విద్యాభ్యసన కాలము గానిసమయముల నితఁడు సుందరమగు నాపురవీధులలోఁ బచారు చేయుచు నెదురు పడ్డ ప్రజతో సంభాషించుచుండును. అచ్చటి సర్వకలాభవన విద్యార్థులు బంతులాడుచుంటను జూచి యొక్కొక వేళ సంత