పుట:Delhi-Darbaru.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ జార్జి పట్టాభి షేకము.

383


నీ సుసందర్భమున నైక్య మొనర్చు చున్న వను దృఢ భానము నాకు గల్గియున్నది. ఇట్టి మనోభావములను బ్రదర్శించు నుద్దేశముతో నా విశేషానుగ్రహ విశేషవి వేచనలం దెలుపు కొన్ని కార్యములచే నాపట్టాభి షేకమ సూత్సనమును స్మరణీయము సేయఁ దలంచి నాఁడను.ఆవ్వానిని నాగవర్నరు జనరలు ముందీమహా సభకుఁ దెలుపఁ గలఁడు.

మీహక్కులను స్వాతంత్ర్యములను గౌరవించు విష యమున నాకు వందనీయులగు నా పూర్వికుల చే నుడువఁ బడిన స్థిరవాక్యములను స్వయముగ దృఢ పఱచుటకును మీక్షేమ మును శాంతిని సంతుష్టిని హృదయపూర్వకముగఁ గోరుచుండు టను దెలియఁ జేయుటకును నాకీ తరుణమబ్బినందులకు సంత సించుచున్నాఁడను.

కృపామయుండగు నాపరమాత్ముడు నా ప్రజలను గాచుచు వారికి సౌఖ్యము:ను నభివృద్ధిని గలుగఁ జేయుటకు నాకు సాహాయ్యముం బ్రసాదించుగాత !

ఇచ్చటంగల సాముత ప్రభువులకును నాప్రజకును "మేము ప్రేమా పూర్వక స్వాగత మిచ్చుచున్నా రము.” సర్వ జనులకును సమానముగ వినిపించునట్టిసుస్వన మున నిట్టిసూక్తులు చక్రవర్తిగారి ముఖము నుండి వెలువడి