పుట:Delhi-Darbaru.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దొడ్డకృష్ణ రాజు.

329


గొని వచ్చిరి. ఇంతియకాక వారు మొగలాయీల రాజ్యాంగ వ్యవస్థను బరిశీలించి దానిం గుణించిన అమూల్య జ్ఞానమును గూడ సంపాదించుకొని వచ్చి.. అద్దాని ఫలముగ మైసూరు నందును వేరు వేరు కార్యములకు వేరు వేరు రాజ్యాంగములు సంఖ్యకు పదునెనిమిది ఏర్పడెను. పన్నులు కాలక్రమమునఁ దప్పక వసూలు కాఁజొచ్చెను. ప్రతిదినమును రెండు వేల పూల వరహాల మొ త్తమును తన బొక్కసములో నిలువ పైకము నకుఁ జేర్చుటకు మున్ను చిక్క దేవరాయఁడు ప్రాతః కాల భోజ నము చేయుచుండ లేదని యొక వాడుక. అట్లు ధనము చేర్చిన వాఁడుగావున నే అతనికి నవకోటి నారాయణుఁడని పేరు. అతఁడు 76 సంవత్సరముల నయస్సున 1704 వ సంవత్సరమున పరమ పద మందెను. ఆతఁడు మృతి మెందునప్పటికి మైసూరు రాజ్యము' దక్షిణమున పళని అన్నా మలలు మొదలు ఉత్తరమున మిడగేశి వఱకును, తూర్పున కర్నాటక ఘరము మొదలు పడమట. కొడగు బాలముల సరిహద్దులవజకును వ్యాపించియుండెను.

దొడ్డకృష్ణ రాజు.

దొడ్డకృష్ణ రాజు కాలమున (17 13-31) శ్రీ రామండలము సంకుచితము చేయఁబడెను. ఆర్కాటు నవాబొక్కఁడు క్రొత్తం గనేర్పడెను. మైసూరు సంస్థానము ద్రవ్యవంత మయినందున నీ రెండు మండలములలోని మహమ్మదీయ ప్రతి నిధులును మైసూరు పైకి దృష్టులు నెగడింప మొదలిడిరి. మొగలాయి-