పుట:Delhi-Darbaru.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

మైసూరు రాజ్యము


పొదుషాహలు నామమాత్రులగుచు వచ్చుటవలన దక్షిణ హిం దూస్థానమున వారి ప్రతినిధులుగ నుండిన వారు స్వతంత్రులయి యొకరితో నొకరు పోట్లాడు కొనుటయు మహారాష్ట్రులు మరల బలవంతులయి చూపట్టుటయుఁ దటస్థించెను. అందుచే మైసూరు రాజులు అందఱకును దలయొగ్గి వారు దండెత్తినచ్చి నప్పుడు కప్పము లిచ్చి తప్పించుకొనవలసిన చ్చెను. బొక్కస 'ములోని ద్రవ్యము కర్చుపడి పోవుటయేగాక ఒక తరుణమున పీష్వాగారిని సమాధానపఱచుటకయి యీతనికిఁ గొన్ని తాలూ కాలు జామీనుగ నెసంగ వలసిన చ్చెను (1757). ఇట్టిదుర వస్థ కాలమున మైసూరు రాజుల ముఖ్యవంశము నిలచిపోవుటయు వేరు శాఖలలో నుండి వచ్చినవారైనను బుద్ధిమంతులు గాక పోవుటయు సంభవించుటచే రాష్ట్రములోని బలమంతయు మంత్రుల చేతులలో దొరకిపోయెను.

మంత్రు లేరాజులు.

అట్టి మంత్రులలో దేవ రాజ నంజ రాజులు మనకథకు నవసరము. ఇందులో నంజరాజు అప్పుడు ముజఫరుజంగు నాజరుజంగుల మూలమునను చందాసాహెబ్ ఆన్వారుద్దీనుల మూలము నను ఫ్రెంచివారికిని ఆంగ్లేయులకును జరుగు చుండిన పోరాటములలో రెండు ప్రక్కలను సమయాను 'కూలముగ సంబంధములు గలుగఁ జేసికొని పనిచేయుచుండెను.