పుట:Delhi-Darbaru.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్ల వులు.

299


దేశమునకుఁ దరలవలసినవారై తుట్టతుదకు రమారమి క్రీస్తు నకు తగువాత మూఁడవశతాబ్దమున కాంచీపురమునకు వచ్చి చేరి యచ్చట రాజ్య మేల మొదలిడి?. పారసీకమునుండి కాంచీ పురమునకు వచ్చునప్పటికి బహుకాలము పట్టియుండుననుట వేరుగ వ్రాయనలసిన పని లేదు. మొదట నీపల్లవులమత మే మయినదియు మన మెఱుగము. మనకుఁ దెలిసినంతనజకు వీరు కాల దేశముల ననుసరించి మతమును మార్చుకొనుచు శైవులును వైష్ణవులును బౌద్ధులును జైనులు నైనట్టులు వీరి చరిత్రము నలనఁ గన్పట్టు చున్నది. శాతవాహనుల ప్రభ తగ్గిపోవుటతో పల్లవులు వారి 'రాజ్యములో తెలుఁగు దేశ ముగనుండిన భాగము నాక్రమించుకొనిరి. నాలుగవ శతాబ్దమున కంచి నేలిన విష్ణు గోపుని కాలమునకు వీరు దక్ష్మిణహిందూస్థానమున బలవంతు లయి యుండిరని చెప్పవచ్చును. అప్పటినుండియే వీరికిని కదం బులకును వీరికిని చాళుక్యులకును యుద్ధములు విశేషము జరుగ నారంభించెను. ఇందు పల్లవులకును చాళుక్యులకును జరిగిన యుద్ధము లే అత్యుగ్రములని తోఁచుచున్నది. 640 వ సంవత్సరమున హియోను స్యాంగను చీనాప్రవాసికుఁడు కాంచీ పురమును దర్శింపవచ్చెను. అతని వ్రాతల ననుసరించి ఆపుర మయిదుమయిళ్ల చుట్టు కొలత కలదయి యుండెను. అచ్చట భూభాగము సారవంతమయి పేరు పెట్టఁబడి మంచి ఫల ముల నీనుచుండెను. ఉష్ణము మాత్రమధికముగ నుండెడిది.