పుట:Delhi-Darbaru.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

మైసూరు రాజ్యము.



ఆకథల నెల్ల నిట వివరింపఁబని లేదు. ఈ నంశ పురాజులకు బాణరసు లనియు పేరుగలదు. వీరు పదియవ శతాబ్దమునంతము వఱకును స్వాతంత్ర్యమున రాజ్య భారము వహించి తరువాత పల్ల వలకు లోఁబడి పోయినట్లు శాసనముల వలనఁ దేలుచున్నది. 'పదమూఁడవ శతాబ్దమునను పదు నేనవ శతాబ్దమునను వీరు మరల ప్రఖ్యాతికి వచ్చుచున్నారు. ఉత్తర ఆర్కాటు జిల్లాయం దును తిరున ల్వేలియందును అక్కాలమున వీరి శక్తి వెలింగి నట్లు కానవచ్చుచున్నది. కావున వీరు పల్లవుల చే నోడింపఁ 'బడిన తరువాత వీరిలోని సాహసికులు గొందబు దూర దేశము లకుఁ బోయి పరిశ్రమ చేసి మరలఁ గీర్తి సంపాదించిరని నిర్ణ యింపవలసియున్నది.

పల్లవులు.

మహాబలులతోఁ గూడ తూర్పుమైసూరు నందు రాజ్య భారము వహించి తరువాత మిక్కిలి ప్రఖ్యాతి నడసిన వారు 'పల్లవులు. వీరు భారతీయ జన్మమును బురస్కరింపఁ జూచు కొనిరిగాని చారిత్రికవిషయములను బట్టి వీరు పర దేశీయులనుట మనకిప్పుడు విశదమయి యున్నది. వీరు మొదట పారసీకము నుండి హిందూస్థానమును జొచ్చిన యొక తెగ వారు. క్రమక్రమ ముగ దక్షిణహిందూస్థానమును జొచ్చి వీరు మొదట ఆంధ్ర దేశమున స్థాన మేర్పఱచుకొనఁ జూచిరి. కాని గోతమపుత్రుఁ డను ఆంధ్ర రాజు వీరి నోడించెను. కావున వీరింకను దక్షిణ