పుట:Delhi-Darbaru.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మౌర్యులు.

291


హిందూ దేశ చరిత్ర కంతటికిని పోలె మైసూరునకుఁ గూడ కాలనిర్ణయ విషయములకు నిశ్చయాధారమయినది ఆ లెగ్జాండరు దండయాత్రయె (క్రీ. పూ. 327.) అతఁడు హిందూస్థానమును వదలి తన దేశమునకుఁ దరలినతోడనే భరత వర్షమున నేకచ్ఛత్రాధిపత్యము వహించిన వాఁడు చంద్ర గు వ్యుడు. ఇతఁడే మన దేశమునకుఁ బ్రథమచక్రవర్తియని చెప్పవచ్చును. ఈతని వంశము మౌర్యవశము. ఈతని మనుమఁ డే బౌద్ధమతోద్ధారకుఁడయి లోక ప్రసిద్ధి గాంచిన అశోక వర్ధనుఁడు. చంద్రగుప్తుఁడు జై నుఁడు. జై నమత సిద్ధాంత ముల ననుసరించి అతఁడు తన జీవయాత్రాంతమున రాజ్యాధిక ములను వదులుకొని ప్రఖ్యాతుఁడగుభద్ర బాహుఁడను గురువు నాజ్ఞలఁ జెల్లించుచు తపశ్చరణ మొనర్చుటకుగాను అతనితోడం గూడ బయలు దేరెను. ఉజ్జయనీ నగరమున పండ్రెండు సంవత్సరము కఱవు రానున్నదని భద్రబా హుఁడు దన దివ్యజ్ఞానము చే నెఱింగి శిష్యులనందఱను వెంటఁ బెట్టుకొని దక్షిణాభిముఖుఁడై వెడ లెను. మైసూరు సీమలోని శ్రవణ బెళగొళము నొద్దకు వచ్చునప్పటికీ భద్రబాహువునకు మృ త్యువుసమీపించుట యెఱుక యయ్యెను. కావున నతఁడచ్చట నొక్క శిష్యునితో నిలచి తక్కినవారలను ప్రయాణము సాగింపు డనెను. అట్లు గురువుతో నుండిపోయిన యొంటరి శిష్యుఁణీ చంద్రగుప్తుఁడని తెలియవచ్చుచున్నది.శ్రవణ బెళగొళమునందు