పుట:Delhi-Darbaru.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

మైసూరు రాజ్యము.


మైసూరు దేశములోనివియని పరంపరగ జెప్పుకొనఁబడుచున్నది. బభ్రువాహనుని రాజధానియగు మణిపురమును గుఱించి పైని వ్రాయఁబడియెను. అశ్వమచ్చటికి వచ్చినతోడనే బభ్రు వాహనుఁ డద్దానిని పట్టెను. . అర్జునుని కుమారుఁడగుట వలన నతఁడు దానిని మహావైభవమునఁ దండ్రి కర్పింపఁ. బోయెను. విధివశమున నర్జునుఁడు పుత్రుని గుర్తింప లేక అతనిని తిరస్క రించెను. 'కావున వారిరువురకును యుద్ధము జరిగెను. యందర్జునుఁడు మృతుఁడయ్యెను. బభ్రువాహనుని తల్లి యగు చిత్రాంగద అర్జునునితో సహగమనము సేయ సిద్ధపడెను. దాని మీదట బభ్రువాహనుఁడు ఉలూపి సాయమున నాగుల యెద్ద సంజీవిని కలదని విని సామమున నది లబ్ధిపనందున వారితో యుద్ధము చేసి సంపాదించి తెచ్చి అర్జునుని బ్రతికించుకొనెను. తరువాత నాయజ్ఞపశువు రత్నపురమును అటు తరువాత కుంతలమును బ్రవేశించెను. ఈరత్న పురకుంతలములు కాడూరు జిల్లాలోని లక్వల్లి యనియు శివ మొగ్గ జిల్లాలోని కుబత్తూరు అనియు వాడు కొనుచున్నారు.

మైసూరు సీమ యందింకనుకొన్ని పురాణగాథలలోని స్థలములున్న వని వాడుక లున్న విగాని వాని నంతయును వివ రించుట మన కార్యమున కవసరముగాదు. కావున నింతటితో పురాణగాథల నటుండనిచ్చి చారిత్రిక విషయములఁ బ్రారం భింతము.