పుట:Delhi-Darbaru.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

మైసూరు రాజ్యము.


భద్రబాహుఁడు పరలోకమున కేగువఱకును నతనికి సపర్య లొనర్చి పిదప పండ్రెండేండ్లు మునివృత్తినుండి భరతవర్షపు ప్రథమచక్రవర్తి పరమపదము నందె ననుచున్నారు. ఈకథకుఁ బ్రోద్బల మొసంగుటకు వలయు స్థల నామములును ఆలయము లును శాసనములును శ్రవణ బెళగొళమునందుఁ గలవు. ఈకథ మనము విశ్వసించినను విశ్వసింపకున్నను రైసుగారి వలన మైసూరు. నుండలమున ఈశాన్య భాగమునందు గనిపట్టఁబడిన అశోకుని శాసనములను బట్టి ఆ భాగము మౌర్యుల రాజ్యములో జేడియుండెననుట మాత్రము దప్పక సిద్ధించుచున్నది. అశో కుఁడు మహిష మండలమునకును (మైసూరు) వనవాసికిని (మైసూరు మండలమ: నందు నాయవ్య భాగము) తన మత ప్రచారకులను బంపెను. ఈ రెండును నతని రాజ్యపు సరిహద్దున కావలనుండిన ప్రదేశములని చెప్పవలసియున్నది. షి కారు పురమందలి బండని క్కె గ్రామముకడనుండు పండ్రెండవ శతా బపు శాసన మొక్కటి కుంతలమును మౌర్యుల రాజ్యములోని భాగముగ వర్ణించుచున్నది. ఇది రమారమి పడమటి కనుమలు పశ్చిమమున నెల్లగాఁగలిగి భీమా వేదవతుల మధ్య భాగమున నుండు భూభాగము. ఇందు శిన మొగ్గ, చిత్రదుగ్గము, బళ్లారి, ధార్వాడ, బిజాపురము జిల్లాలును వీని సరిహద్దులనుండు బొం బాయి రాజధాని నైజాము ఇలాకా భూములును . నిమిడి యున్నవి.