పుట:Delhi-Darbaru.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురాణ ప్రసిద్ధమగు చరిత్రాంశములు,

287..

.

పలుమారు పేర్కొనఁబడుచుండుటవలన ' మైనూరు. దేశపు బూర్వచరిత్రయందొక కొంత పురాణగాథల నుండియే వ్రాయ బడవలసి యున్నది. అగస్త్యుడు ఇల్వలవాతాపులను మడియిం. చిన ఘట్టము నెలమంగళము . వద్ద నర్క వతీ నది పయనుండు- స్తంభోదధి (కమ్మసంద్రము) అను గ్రామమని చెప్పఁ బడు చున్నది. ఇతరులగు ఋషులును నీ దేశమున తపోధనులయి నట్టును నుడువఁబడుచున్నది. గౌతముఁడు కావేరీ తీరమున శ్రీరంగ పట్నమునందును కణ్వుఁడు ఉన్న పట్నమునకు సమీపమున వేలూరు నొద్ది నదీతీరమునను, విభాండకుఁడు తుంగానది పయి శృంగేరికడను, మార్కండేయుఁడు భద్రానది పై కాండేయము ఒద్దను, దత్తా త్రేయుఁడు బాబా బుడ్డను పర్వతముల మీదను తపశ్చరణము సల్పినట్లు ప్రతీతి కలదు.

ఆర్యులు దక్షిణాపథమునకు వచ్చునప్పటికి మైసూరు సంస్థాన ప్రదేశమున రాజ్య మేలుచుండిన వారలలో రాక్షసులని వారిచేఁ - బిలువంబడిన స్థానిక రాజులుండినట్లు విశదమగు చున్నది. నిష్కర్షగ వీర లే యీ కాలము వారని చెప్పుట కాధా రములు లేవుగాని పురాణ గాథలను బట్టి 'తుంగభద్రమీఁది. హరిహరము రాజధానిగ గుహాసురుఁడును, చిత్రదుర్గము ముఖ్య పట్టణముగ హిడింబాసుకుఁడును, రహమను ఘరము నుద్ద బకాసురుఁడును, మైసూరను నామమునకుఁ గారణభూతుఁడగు