పుట:Delhi-Darbaru.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286.

మైసూరు రాజ్యము.


నుండఁజాలదు. ఆంధ్రులు కర్నాటకులని వర్ణింపఁబడి యుండు టకుఁగూడ 'నిదియె ' కారణమని 'తో (చుచున్నది. మఱియొక కొద్ది యాధారముగూడ నున్నది. " (కన్నడ' మను శబ్ద స్వరూప మును:మనకుఁ దోడుపడు చున్నది. ఇది కన్ :- నాము అను పద ములనుండి వచ్చిన దే. .కన్ అనఁగా కన్నడ భాషయందు చీకటి యనియే యర్థము. కావున - నిదియు చీకటి దేశ మను నర్థమునే ఇచ్చుచున్నది

ఇట్లు కర్నాట శబ్దము దండకారణ్యమునకు తెలుఁగు వారును కన్నడమువారును నట నైక్యమున నివసించు కాలమున వచ్చినదని చెప్పవచ్చును. మహమ్మదీయుల ప్రవేశముతోఁ గర్నా టక పదము దండకారణ్య ప్రదేశమునకు మాత్రముగాక మల దిగిన తరువాత ' దానికి దక్షిణమునను దూర్పునను నుండు భూభాగమునకుఁ గూడ వర్తింపజొచ్చెను. ఆంగ్లేయులు ప్రమాదవశమున నాపదమును మలదిగిన తరువాత నుండు బయళ్లకు మాత్రమె యన్వయింపఁ - జేసిరి. కావున న్యాయ ముగఁ గర్నాటక మను పేరుతో బరగవలసిన మైసూరున కా పేరు లేకుంటయు నితర ప్రాంతముల కా పేరు వచ్చుటయుఁ దటస్థించిన ది.

పురాణ ప్రసిద్ధమగు చరిత్రాంశములు.

మైసూరు నందు వి శేషభాగము - దండకారణ్యముగ నుం డెనని వ్రాయఁబడియెను. - పురాణములయందీ యరణ్యము