పుట:Delhi-Darbaru.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురాతన నామము,

285


(అనఁగా చెవునకుపండువు) అని నిర్ణయి)చుచున్నారు. డాక్టరు గుడర్టు “కార్' 'నాడు' అను రెండుపదములు చేరి కర్నాట మయిన దనియు 'కార్ ' అనఁగా నలుపుగావున నల్ల రేగడి భూమినలన నీ పేరీ దేశమునకు వచ్చి యుండవచ్చుననియు నుడువు చున్నాఁడు. 'కాన్ ' 'నాడు'. అను పదద్వయ సమేళనముచే వచ్చినదనుట సమంజసమే కాని డాక్టరుగుండర్డుగారి యర్థము సరియైనది మూత్రము కాదని చెప్పవచ్చును. కార్ శబ్దము తెలుఁగు నందు 'కారు' అను రూపమునం గాననగును. మనభాషయందుఁ గూడ నీపదమునకు నలుపు' (చీఁకి టి) అని యే యర్థము. నాడు శబ్దము రెండు భాషలకును సామాన్య మే. కావున కారునాడు లేక కర్నాడు లేక కర్నాటము అనఁగా చీకటి దేశమని యర్థము తేలు చున్నది. ఈ చీకటి దేశము ఆంధ్రశబ్దము చే 1[1]సూచింపఁబడు దండ కారణ్యముదక్క మఱియెద్ది కాఁగలదు? ఆ కాలమున నిప్పటి మైసూరు నందు విశేషభాగము దండకారణ్యము లోనిదేయని చెప్పుటకు సందియ మనసరము లేదుగదా! 2 [2]అట్టిచో 'ఆంధ్ర' మనునది సంస్కృత భాషావిదులచే, కర్నాట శబ్ద పర్యాయ పదముగఁబ్రప్రథమమున నుపయోగింపఁబడి పిదప విభేద మేర్పడిన తరువాత నది తెలుఁగు శాఖకు చెం దెననుటలో సాహసమేమియు

.............................................................................................

  1. ఆంధ్రశబ్దమున కుత్పత్తి నరియువారు మ. రా.. రా. శ్రీ. చిలుకూరి వీర భద్రరావు గారిచేవిరచితమయిన ఆంధ్రుల చరిత్ర పూర్వయుగమును జూచునది
  2. హిందూ మహాయుగము. మూఁడవ ప్రకరణము చూచునది.